Monday, November 24, 2025
E-PAPER
Homeఆటలుతొలి టీ20 అంధ మహిళల ప్రపంచకప్‌ విజేత భారత్‌

తొలి టీ20 అంధ మహిళల ప్రపంచకప్‌ విజేత భారత్‌

- Advertisement -

నేపాల్‌ జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించి..

కొలంబొ : భారత అంధ మహిళల క్రికెట్‌ జట్టు తొలి టి20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచింది. ఆదివారం స్థానిక పి సారాఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో నేపాల్‌ జట్టును ఏడు వికెట్ల తేడాతో భారత్‌ ఓడించింది. తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న నేపాల్‌ జట్టు 5 వికెట్టకు 114 పరుగులకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ 12 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి టైటిల్‌ను గెలుచుకుంది.
నేపాల్‌ జట్టు తమ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీని మాత్రమే సాధించగలిగింది. భారత్‌ తరపున ఫూలా సరెన్‌ 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. తొలి సెమీ ఫైనల్లో భారత్‌ ఆస్ట్రేలియాపై విజయం సాధించగా, శనివారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో నేపాల్‌ పాకిస్తాన్‌పై గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, శ్రీలంక, అమెరికాలు పోటీ పడ్డాయి. కొన్ని మ్యాచ్‌లు బెంగళూరులో జరగగా, కొన్ని మ్యాచ్‌లు కొలంబోలో జరిగాయి. సహ ఆతిథ్యదేశమైన శ్రీలంక ఐదు ప్రాథమిక రౌండ్‌ ఆటల్లో యుఎస్‌ఎపై ఒక ఆటను మాత్రమే గెలువగలిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -