నవతెలంగాణ-హైదరాబాద్: హెచ్1బీ వీసా ఫీజు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్ ప్రధాని కనీసం ఏదైనా చేయండి, మీ నిర్లక్ష్యంతో 140 కోట్ల జనాభా కలిన ఇండియా నిస్సహయత స్థితిలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న మీరు ఏమి చేయలేరా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. క్లిష్ట తరహా పరిస్థితులను ప్రధాని మోడీ కంట్రోల్ చేయలేపోతున్నారని, ఆయన చర్యలతో 140 కోట్ల భారతీయులు నిరుత్సహపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్1బీ వీసా ఫీజు పెంపుతో భారతీయల మీద పెను ప్రభావం పడనుందని కేజ్రీవాల్ అన్నారు.
కాగా ఇవాళ H-1B వీసా దరఖాస్తులపై USD 100,000 రుసుము విధించాలని US ప్రభుత్వం నిర్ణయించింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే నెల సెప్టెంబర్ 21నుంచి అమలోకి రానుంది. అక్రమ వలసదారులను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ ప్రభుత్వం పేర్కొంది. తమ నిర్ణయంతో నాణ్యమైన ఉద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది.