Monday, September 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముగిసిన ఇండియన్‌ బ్యాంక్‌ అసెట్స్‌ ఫెయిర్‌ ఫీల్డ్‌

ముగిసిన ఇండియన్‌ బ్యాంక్‌ అసెట్స్‌ ఫెయిర్‌ ఫీల్డ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
‘ఇండియన్‌ బ్యాంక్‌ అసెట్స్‌ ఫెయిర్‌ ఫీల్డ్‌ – 2025’ రెండు రోజుల కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌ సోమాజిగూడలోని జయ గార్డెన్స్‌లో ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ (ఎప్‌జీఎం) ప్రణీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రణీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ఫెయిర్‌ సందర్శించడానికి 100 మందికి పైగా కొనుగోలుదారులు వచ్చారన్నారు. ఇండియన్‌ బ్యాంక్‌ దేశంలోని వివిధ ప్రాంతాల్లో అసెట్‌ ఫెయిర్లను నిర్వహిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ ఫెయిర్‌లో 120కి పైగా ఆస్తులను ప్రదర్శించామన్నారు. సిబ్బంది కొనుగోలుదారులకు కావాల్సిన సమాచారాన్ని అందించడంలో అంకిత భావంతో పని చేశారన్నారు. కార్యక్రమం విజయవంతమవ్వడానికి కషి చేసిన బ్యాంకు సిబ్బందిని, నిర్వాహకులను ఆయన అభినందించారు. హైదరాబాద్‌, మల్కాజిగిరి, కరీంనగర్‌ జోన్ల అధికారులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నట్టు ఆయన వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -