– రూ.1,422 కోట్ల లోన్ల పంపిణీ
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఎత్తున నిర్వహించిన మెగా రామ్ (రీటైల్, అగ్రికల్చర్, ఎంఎస్‌ఎంఈ) క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం విజయవంతమైందని ఆ బ్యాంక్ తెలిపింది. రెండు రాష్ట్రాల్లోని 8 జోన్ల పరిధిలో నిర్వహించిన ఈ ప్రత్యేక రుణ వితరణ డ్రైవ్‌లో భాగంగా మొత్తం రూ.1,422 కోట్ల విలువైన రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేసి పంపిణీ చేసినట్లు వెల్లడించింది. తిరుపతిలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో హైదరాబాద్ ఎఫ్.జి.ఎం ప్రాణేష్ కుమార్ పాల్గొని.. లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల అవసరాలే లక్ష్యంగా తమ బ్యాంక్ సేవలు ఉంటాయన్నారు. ముఖ్యంగా ఇండ్‌స్మార్ట్, ఇండ్‌స్మార్ట్ బిజ్ వంటి మొబైల్ యాప్‌ల ద్వారా డిజిటల్ పద్ధతిలో రుణాలు పొందడంపై అవగాహన కల్పించారు. తెలంగాణలో హైదరాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్ జోన్ల మేనేజర్లు.. ఏపీలో అమరావతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం జోనల్ మేనేజర్లు వారి బృందాలతో కలిసి ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.
ఇండియన్ బ్యాంక్ మెగా రుణ క్యాంపెయిన్
- Advertisement -
- Advertisement -


