Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ప్రపంచ వృద్ధికి భారత ఆర్థిక వ్యవస్థ కీలకం ఆర్బీఐ రిపోర్ట్‌

ప్రపంచ వృద్ధికి భారత ఆర్థిక వ్యవస్థ కీలకం ఆర్బీఐ రిపోర్ట్‌

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ వృద్ధికి భారత ఆర్థిక వ్యవస్థ కోలక చోదక శక్తిగా నిలుస్తుందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల దృఢత్వం, బలమైన మూలధన నిల్వలు, తక్కువ నిరర్థక ఆస్తులు, బలమైన ఆదాయాలతో బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్టంగా ఉందని ఆర్బీఐ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఆర్థిక మార్కెట్లు అస్థిరంగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రభుత్వ బాండ్‌ మార్కెట్లు, పెరుగుతున్న ప్రజా రుణ స్థాయిలు, పెరిగిన ఆస్తి విలువలు వంటి ప్రస్తుత దుర్బలత్వాలు సవాళ్లుగా నిలుస్తు న్నాయని పేర్కొంది. కాగా.. బ్యాంకింగ్‌ రంగం ఇప్పటికీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపింది. సైబర్‌ రిస్క్‌లు, డిజిటల్‌ మోసాలు, ఆర్థిక స్థిరత్వ సమస్యలు ఆందోళనకరంగా ఉన్నా యని తెలిపింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేస్తోందని తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad