నవతెలంగాణ – మిర్యాలగూడ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిర్యాలగూడ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్ను కున్నారు. స్థానిక ఐఎంఏ భవనంలో సమావేశం నిర్వహించుకొని కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ కె అశ్విన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జానకి రాములు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ మనోహర్, కోశాధికారిగా డాక్టర్ శ్రీ ప్రియ, సహాయ కార్యదర్శలుగా డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ మాధవ కుమార్ డాక్టర్ సతీష్ కుమార్, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ జె రాజు, డాక్టర్ వి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES