- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చైనా పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత పారా షట్లర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రమోద్ భగత్ మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్–3 ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ముహ్ అల్ ఇమ్రాన్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు. సుకాంత్ కడమ్ మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్–4 ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ మజుర్ చేతిలో ఓడి రజతం సాధించాడు. మెన్స్ డబుల్స్‌లో ప్రమోద్ భగత్, సుకాంత్ కడమ్ జంట రజతంతో సరిపెట్టుకుంది.
- Advertisement -