Saturday, December 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంటొరంటో వర్సిటీ సమీపంలో భారత విద్యార్థి హత్య

టొరంటో వర్సిటీ సమీపంలో భారత విద్యార్థి హత్య

- Advertisement -

టొరంటో : టొరంటో యూనివర్సిటీ క్యాంపస్‌కు సమీపంలో భారతీయ విద్యార్ధిని మంగళవారం కాల్చి చంపారు. కాగా బాధితుడిని శివాంక్‌ అవస్థి (20)గా పోలీసులు బుధవారం గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మంగళవారం రాత్రి 3.30గంటల పాత్రంలో నేలపై గాయపడిన వ్యక్తి ఒకరు పడి వున్నట్టు పోలీసులకు సమాచారం అందింది, వెంటనే అక్కడకు వెళ్ళి చూడగా తపాకీ కాల్పులతో ఒక వ్యక్తి పడిపోయాడని, ఆ వ్యక్తి అక్కడనే మరణించాడని ధృవీకరించినట్టు డ్యూటీ ఇనస్పెక్టర్‌ జెఫ్‌ అలింగ్టన్‌ విలేకర్లకు తెలిపారు. అసలు ఏం జరిగిందో తెలుసు కోవడం, వారి కుటుంబానికి సమాచారం తెలియచేయడం పై తాము తక్షణం దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని, పైగా నిందితుడు కూడా పారిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బాధిత కుటుంబానికి అవసరమైన సాయమందించడానికి, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడానికి సిద్ధంగా వున్నట్టు భారత కాన్సులేట్‌ కార్యాలయం ఎక్స్‌ పోస్టులో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -