– పునర్నిర్మించిన జామియా మస్జీద్ నూతన ప్రారంభం
– హాజరైన తాజా మాజీ ఎమ్మెల్యేలు జారె,మెచ్చా లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
సకల మతాల సారంతో కూడిన సమ్మేళనం మే భారతీయత అని తాజా మాజీ ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ,మెచ్చా నాగేశ్వరరావు లు అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మొదటి మస్జీద్ అయిన 60 ఏళ్ళ నాటి జామియా మస్జీద్ ను సుమారు కోటి వ్యయంతో ఆధునిక హంగులు తో స్థానిక మస్జీద్ కమిటీ ఆద్వర్యంలో హైద్రాబాద్ కు చెందిన నసీరుద్దీన్ కుమారుడి ఆర్ధిక సహకారంతో ఇటీవలే పునర్నిర్మించారు.
ఈ మస్జీద్ ను ఆదివారం ఖమ్మం జామియా తుల్ ఉలామ సదర్,హజ్రత్ మౌలానా ముహమ్మద్ సయీద్ అహ్మద్ సాహబ్ ఖాస్మి,తమిళనాడు ఉలామా సదర్,ఆర్పిబుల్లా హజ్రత్ మౌలానా మస్తీ ముహ్మాద్ సబీర్ సాహబ్ ఖాస్మి లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలాలుద్దీన్ సాహబ్ ఖాస్మి,అబ్దుల్ కరీం సాహబ్ రషాబీ,స్థానిక మస్జీద్ కమిటీ గౌరవాధ్యక్షులు అబ్దుల్ రహమాన్ బాబా,సదర్ వలీ పాషా,సభ్యులు నజీర్,ఆసీఫ్,ఉస్మాన్ లు పాల్గొన్నారు.