Tuesday, March 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండియన్స్‌ అప్రమత్తంగా ఉండాలి

ఇండియన్స్‌ అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

భారత్‌ అడ్వైజరీ జారీ
మస్కట్‌:
పశ్చిమాసియాలో ఘర్షణల వేళ భారత్‌ కీలక ప్రకటన చేసింది. బహ్రెయిన్‌లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. స్థానిక అధికారుల భద్రతా మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. అలాగే సహాయం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌లను కూడా విడుదల చేసింది. ఈ మేరకు బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీ చేసింది.
ఇరాన్‌పై దాడులు… టెన్షన్‌లో భారతీయ విద్యార్థులు
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, యూఎస్‌ దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. తాము నిస్సహాయులం అయిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌, అమెరికా టెహ్రాన్‌పై దాడులు కొనసాగిస్తున్నందున తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ని అభ్యర్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -