- Advertisement -
ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా
న్యూఢిల్లీ : బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడం ద్వారా భారత్‌కు ప్రయోజనమేనని ఆర్‌బీఐ గవర్నర్ సంజరు మల్హోత్రా పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. బీఎఫ్‌ఎస్‌ఐ సమ్మిట్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఇరుదేశాలు చేసుకున్న ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థలోని బహుళ రంగాల అభివృద్ధికి దోహదం చేయనుందన్నారు. ఇతర దేశాలతోనూ భారత్ ఇటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి భారత్ అమెరికాతో సహా పలు దేశాలతో వాణిజ్య చర్చలు కొనసాగిస్తోందని మల్హోత్రా అన్నారు.
- Advertisement -