Sunday, April 12, 2026
E-PAPER
Homeజాతీయంభారతవృద్ధి 6.9శాతం ఉండొచ్చు

భారతవృద్ధి 6.9శాతం ఉండొచ్చు

- Advertisement -

ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు వాణిజ్యం, విదేశీ నగదు బదిలీలపై ప్రతికూల ప్రభావం


న్యూఢిల్లీ : అమెరికా టారిఫ్‌లతో బెంబేలెత్తుతున్న భారత కంపెనీలు, మరోవైపు పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణలు ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తుంటే మరోవైపు అంతర్జాతీయ సంస్థలు భారత జీడీపీ అంచనాలను పెంచేస్తున్నాయి. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ అనేక సంస్థలు భారత జీడీపీ జోరుమీద ఉందని పేర్కొంటుండగా.. ఆ జాబితాలో తాజాగా ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) చేరింది. దేశీయంగా పెరుగుతున్న వినియోగం, పెట్టుబడులు, ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణల వల్ల 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 6.9 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని ఏడీబీ పేర్కొంది. అంతకుముందు 6.5 శాతంగా అంచనా వేసింది. 2027-28 ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత పుంజుకుని 7.3 శాతానికి చేరుతుందని పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు వాణిజ్యం, విదేశీ నగదు బదిలీలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్‌ ఇటీవల కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, అనుకూలమైన విధానాలు ఎగుమతులను బలోపేతం చేస్తాయని విశ్లేషించడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -