Tuesday, October 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅదానీ కేసులో స్పందించని భారత్‌

అదానీ కేసులో స్పందించని భారత్‌

- Advertisement -

న్యూయార్క్‌ కోర్టుకు తెలిపిన ఎస్‌ఈసీ
265 మిలియన్‌ డాలర్ల
ముడుపుల కుంభకోణం
అదానీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు కూడా జారీ చేయని మోడీ సర్కార్‌
న్యూయార్క్‌ కోర్టుకు తెలిపిన ఎస్‌ఈసీ

న్యూయార్క్‌ : అదానీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు, ఫిర్యాదులు అంద జేయడంలో భారత అధికారులు విఫలమ య్యారని అమెరికా సెక్యూరిటీలు -ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) న్యూయార్క్‌ న్యాయ స్థానానికి తెలియజేసింది. అదానీ గ్రూప్‌ సెక్యూరిటీల మోసానికి, 265 మిలియన్‌ డాలర్ల ముడుపుల కుంభకోణానికి పాల్పడిందన్న ఆరోపణలపై ఎస్‌ఈసీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసు విచారణలో తమకు సహకరించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని ఎస్‌ఈసీ పదేపదే అభ్యర్థించింది. అయితే ప్రభుత్వం నుంచి తగిన స్పందన లభించడం లేదు. అదానీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు కనీసం సమన్లు కూడా జారీ చేయలేదు.

అదానీ గ్రూప్‌ సంస్థ అయిన అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేసిన విద్యుత్తును కొనుగోలు చేసేలా భారత అధికారులకు ముడుపులు అందించారని ఆరోపిస్తూ ప్రాసిక్యూటర్లు 2024లో కోర్టులో కేసు వేశారు. ముడుపుల ద్వారా లబ్ది పొందిన భారత అధికారులు కంపెనీ గురించి తప్పుడు సమాచారం అందించి అమెరికా మదుపుదారులను తప్పుదోవ పట్టించారని ఎస్‌ఈసీ తన ఫిర్యాదులో తెలిపింది. కాగా అదానీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు గౌతమ్‌ అదానీ, ఆయన తమ్ముడి కొడుకు సాగర్‌ అదానీలకు లీగల్‌ డాక్యుమెంట్లు అందించే విషయంలో తాను భారత న్యాయ శాఖను అనేక పర్యాయాలు సంప్రదించానని, చివరిసారిగా గత నెల 14న మాట్లాడామని, అయితే డాక్యుమెంట్లను అందించినట్టు సమాచారమేదీ అందలేదని న్యూయార్క్‌ కోర్టుకు ఎస్‌ఈసీ తెలియజేసింది. భారత న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కొనసాగిస్తానని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -