Sunday, October 19, 2025
E-PAPER
Homeఆటలుతొలి వన్డేలో భారత్ టాఫార్డర్ విఫ‌లం

తొలి వన్డేలో భారత్ టాఫార్డర్ విఫ‌లం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది.అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆఖరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని మెరుపులతో భారత్ ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది.

పెర్త్ స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు భారత బ్యాటర్లు నిలవలేకపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (8), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్ 21 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్ (11) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ కున్‌మాన్ తలా రెండు వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్‌కు చెరో వికెట్ దక్కింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -