Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeఆటలుభారత్‌కు రెండో ఓటమి

భారత్‌కు రెండో ఓటమి

- Advertisement -

– 100-69తో చైనా గెలుపు
జెద్దా (సౌదీ అరేబియా) : ఫిబా బాస్కెట్‌బాల్‌ ఆసియా కప్‌లో టీమ్‌ ఇండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గ్రూప్‌-సి తొలి మ్యాచ్‌లో జోర్డాన్‌పై 30 ఏండ్ల తర్వాత విజయం సాధించేలా కనిపించిన భారత్‌… ఓవర్‌టైమ్‌లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. గత మ్యాచ్‌ ఉత్సాహంలో ఉన్న భారత్‌.. గ్రూప్‌ దశ రెండో మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ చైనా చేతిలో పరాజయం పాలైంది. 69-100తో 31 పాయింట్ల తేడాతో దారుణ ఓటమి మూటగట్టుకుంది. నాలుగు క్వార్టర్లలో చైనా స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. 29-14, 24-17, 22-17, 25-21తో ప్రతి దశలోనూ భారత్‌పై పైచేయి సాధించింది. భారత్‌ తరఫున ప్రణవ్‌ ప్రిన్స్‌, అరవింద్‌ ముతుస్వామి రాణించారు. ఇంటర్నేషనల్‌ బాస్కట్‌బాల్‌ అసోసియేషన్‌ రూల్స్‌ ప్రకారం ఆసియా కప్‌లో గ్రూప్‌ దశలో టాపర్‌గా నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుతుంది. గ్రూప్‌లో 2, 3వ స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో క్వార్టర్స్‌ బెర్త్‌ కోసం పోటీపడాల్సి ఉంటుంది. గ్రూప్‌ దశ చివరి మ్యాచ్‌లో ఆతిథ్య సౌదీ అరేబియాతో భారత్‌ శనివారం తలపడనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad