- Advertisement -
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్
బులావయో : ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ గ్రూప్ దశను యువ భారత్ అజేయంగా ముగించింది. శనివారం న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచింది. కివీస్ కుర్రాళ్లు తొలుత 36.2 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 13.3 ఓవర్లలోనే 130/3తో ఊదేసింది. భారత బౌలర్లలో అంబరీశ్ (4/29), హేనిల్ పటేల్ (3/23) రాణించగా.. బ్యాటర్లలో ఆయుశ్ మాత్రె (53), వైభవ్ సూర్యవంశీ (40) మెరిశారు.
- Advertisement -



