- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, ఏఐ భయాలు మన సూచీలను దెబ్బతీశాయి. నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ.. నేటి ట్రేడింగ్‌లోనూ ఐటీ షేర్లు భారీగా పతనమయ్యాయి.
ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్ 760 పాయింట్లు క్షీణించి, 82,906 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 245 పాయింట్లు పతనమై 25,561 వద్ద కదలాడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు కోల్పోయి, 90.69గా ఉంది.c
- Advertisement -



