- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌తో భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై భారత్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాక్-భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా జమ్మూ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుందని ఇండిగో, ఎయిరిండియా విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు నిర్వహించే అన్ని విమానాలను శనివారం రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించాయి. మే 13 నుంచి మే 17 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఇండిగో, ఎయిరిండియా అధికారికంగా ప్రకటించాయి.
- Advertisement -