- Advertisement -
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగోను నిర్వహించే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నికర లాభం 62 శాతం పెరిగి రూ.3,067 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,895 కోట్ల లాభాలు గడించింది. కార్యకలాపాల ఆదాయం 24 శాతం పెరిగి రూ.22,152 కోట్లకు చేరింది. డిసెంబర్ త్రైమాసికంలోని నికర లాభం రూ.2,449 కోట్లతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో 25 శాతం పెరిగింది. 2024-25లో మొత్తంగా 11 శాతం తగ్గుదలతో రూ.7,258 కోట్ల లాభాలు నమోదు చేసింది.
- Advertisement -