నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని హాస కొత్తూర్ లో ఇందిరా ఆవాస్ యోజన యాప్ సర్వే ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు సంబంధించి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరా ఆవాస్ యోజన యాప్ సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాప్ లో లబ్దిదారుల పూర్తి వివరాలను సమగ్రంగా పొందుపరచాలని సర్వే చేస్తున్న సిబ్బందికి సూచించారు.
అనంతరం ఆయన గ్రామంలో ఇప్పటికే నిర్మాణాలను ప్రారంభించిన లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల పనుల ప్రగతిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తయితే అట్టి బిల్లులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఇండ్ల నిర్మాణాలకు ఇసుక, మొరం అవసరమైన వారు పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి నరసయ్య, తదితరులు ఉన్నారు.
ఇందిరా ఆవాస్ యోజన యాప్ సర్వే పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES