Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరాగాంధీ జీవితం ఆదర్శనీయం

ఇందిరాగాంధీ జీవితం ఆదర్శనీయం

- Advertisement -

– ఘనంగా ఇందిరాగాంధీ జయంతి
నవతెలంగాణ – మిర్యాలగూడ :
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆదర్శమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకనాయక్ అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి సాగర్ రోడ్డులో ఉన్న ఆమె విగ్రహానికి రాజీవ్ భవన్ లో ఇందిరాగాంధీ గాంధీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఇందిరా గాంధీ గారి జీవితం ఎంతోమంది రాజకీయ నాయకులకు, మహిళా లోకానికి ఆదర్శం అని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం గా వదిలేసిన  మిర్యాలగూడ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్స్ లబ్ధి దారులకు డిసెంబర్ 31 వ తేదీ వరకు అర్హులకు* అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, రామలింగయ్య, స్కైలాబ్ నాయక్, పొదిల శ్రీనివాస్, బసవయ్య గౌడ్, గుండు నరేందర్, నూకల వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి చిలుకూరి బాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -