Sunday, January 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారంలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్‌

మేడారంలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్‌

- Advertisement -

రూ.6 కోట్లతో 565 స్టాల్స్‌ ఏర్పాటు : మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

మహిళాభ్యున్నతికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలు విక్రయించుటకు ఇందిరా మహిళా శక్తి ద్వారా రూ. 6 కోట్లతో 565 షాపులను ప్రభుత్వం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 37 ప్రాంతాల్లో 27 రకాల వ్యాపారాలను మహిళలు నిర్వహించనున్నారు. అందులో మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో 464 యూనిట్లు, మేడారం రాక పోకలు జరిగే మార్గంలో 63 యూనిట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన యూనిట్లు ఇతర చోట్ల నెలకొల్పారు. దీనిపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మేడారం జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ద్వారా ఈ ప్రాంత సంఘాల మహిళలు లబ్ది పొందనున్నారు. ఇప్పపువ్వు లడ్డులు, మిల్లెట్‌ లడ్డులు, రాగి లడ్డులు, పల్లీ లడ్డుల విక్రయ స్టాల్స్‌, ఇప్పనూనె, కోల్డ్‌ ప్రెష్‌ ఆయిల్‌, కారం, పసుపు, మసాలా యూనిట్లు, రాగి జావ, టిఫిన్‌, రొట్టెల యూనిట్‌, మిల్లెట్‌ షేక్‌, స్వీట్‌ కార్న్‌, పాప్‌ కార్న్‌, టీ స్టాల్స్‌, స్నాక్స్‌స్టాల్స్‌, తెలంగాణ పిండి వంటలు, పచ్చళ్ళు, పూజా సామాగ్రి విక్రయ స్టాల్స్‌తతోపాటు బేకరి, క్లాత్‌ రెడీ మేడ్‌ డ్రెస్సెస్‌, గాజులు, బెల్లం, కొబ్బరికాయలు, పూలు, భోజన, అల్పాహర, కిరాణా జనరల్‌ స్టోర్‌, కూల్‌ డ్రింక్స్‌, పాలు, ఫాస్ట్‌ ఫుడ్‌, మొబైల్‌ ఫిష్‌ కర్రీ అవుట్‌ లెట్‌, కోళ్ల విక్రయ అవుట్‌ లెట్‌, కోడి గుడ్ల స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్ల ద్వారా ఆయా కుటుంబాలు ఆర్ధికం గా అభివృద్ధి చెందనున్నాయి. మహిళల ఆర్ధిక స్వావలంబనకు ఇందిరా మహిళా శక్తి పధకం అండగా నిలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -