Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణా పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రోజు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి లో ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించి, మాట్లాడారు. గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు   నిర్మాణంలో ఉన్నాయని,  ఇప్పటి వరకు ఎంత  మేర నిర్మాణ పనులు జరిగాయని, నిర్మాణపు పనులు జరిగినంతవరకు  లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అయ్యాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మొత్త 15 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయ, అన్ని కూడా లెంటల్ వరకు పనులు జరుగుతున్నాయని వివరించారు.

ఇప్పటి వరకు 15 ఇండ్లకు సంబంధిచి వారి అందరికీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ అని తెలిపారు.లబ్ధిదారులు అందరూ కూడా ఇండ్లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. డబ్బులు మీ ఖాతాల్లో ప్రతి సోమవారం జమ అవుతాయ అని తెలిపారు.గ్రామంలో ఎవరు అయినా ఇందిరమ్మ ఇండ్ల ఇప్పిస్తాం వెంటనే డబ్బులు వేయిస్తాం అని  డబ్బులు అడిగితే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలి అన్నారు. అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad