నవతెలంగాణ – జైపూర్
ఆవాస్ యోజన యాప్ లో ఇందిరమ్మ ఇండ్ల నమోదు సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవో సత్యనారాయణ సూచించారు. ఎంపీఓ శ్రీపతి బాపురావుతో కలిసి మంగళవారం టేకుమట్ల గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఆవాస్ యోజన యాప్ నందు ఇందిరమ్మ ఇండ్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామానికి సంబంధించి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి తో పాటు లబ్ధిదారులను ఆదేశించారు.అనంతరం, ఎంపీఓ శ్రీపతి బాపు రావు మొబైల్ ఆప్ ఇన్స్పెక్షన్ లో భాగంగా టేకుమట్ల, నర్సింగాపూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.
సెగ్రిగేషన్ షెడ్ ను పరిశీలించి వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేయాలని, నర్సరీని సందర్శించి మొక్కలను గృహాలకు పంపిణీ చేయాలని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేయాలని తెలిపిన ఆయన గ్రామ పంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ కాంక్ష, ఏపీఓ బి బాలయ్య, పంచాయతీ కార్యదర్శులు శ్రావణి, సుప్రియ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.