Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅర్హులకు ఇందిరమ్మ ఇండ్లు

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి భరోసా

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఆన్‌లైన్‌లో తలెత్తుతున్న పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తెలిపారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా వస్తాయనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ప్రజాప్రతినిధుల ముఖాముఖీ కార్యక్రమంలో ఆమె పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల నుంచి వచ్చి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వినతులే ఎక్కువగా వచ్చాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను అప్‌లోడ్‌ చేసే క్రమంలో కొన్ని రిజెక్టు అవుతున్నాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad