Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి: సీపీఐ(ఎం)

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

ఇందిరమ్మ కమిటీలలో నిర్మాణం చేపట్టే విషయంలో తీవ్ర అవకతవకలు 
సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో వినతి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ నగరంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న నిరుపేదలందరికీ పట్టాను ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నగరంలో ఇందిరమ్మ కమిటీలో వేసి ఇంటి నిర్మాణం చేపట్టే విషయంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని, వీటి వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి కాకుండా కౌన్సిలర్లకు బినామీలుగా ఉన్నటువంటి వాళ్లకు, వారి చేతి కింద ఉన్నటువంటి వాళ్లకు తప్ప, నిజమైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందట్లేదని అన్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ.. గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) నగర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు భీమశంకర్, యశోద, పంచ పూల, రజియా, సురేఖ, సారిక,  సంగీత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -