Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-భిక్కనూర్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. శనివారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులను పరిశీలించారు. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డికి తెలిపారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆరోగ్య కేంద్ర సబ్ సెంటర్ ను పరిశీలించి మందుల కొరత లేకుండా చూడాలని మెడికల్ అధికారి యేమిమాకు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో ఉపాధ్యాయుల విద్యా బోధన పర్యవేక్షించారు. పదవ తరగతి వార్షిక పరీక్షల కోసం ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోని మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజాగంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -