నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భువనగిరి మండలం, గౌస్ నగర్, వలిగొండ మండలం మందాపూర్, గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, గ్రామంలో ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని . అవి ఏ ఏ దశలల్లో ఉన్నాయని తెలుసుకున్నారు.ఇప్పటి వరకు అయినంత వరకు లబ్ధిదారుల అకౌంట్ కి డబ్బులు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ దశ పూర్తి అయినా ఇంటిని పరిశీలించారు. ఇప్పటి వరకు అన్ని బిల్లులు వచ్చాయా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు .మిగతా పనులు కూడా పూర్తి చేసుకొని త్వరగా గృహప్రవేశం చేసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES