Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఅర్హత కలిగిన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి..

అర్హత కలిగిన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి..

- Advertisement -

సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

అర్హత ఉండి ఇందిరమ్మ ఇండ్లు రాని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భువనగిరి మండల పరిధిలోని చీమలకొండూరు గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంజయ్య పాల్గొని మాట్లాడుతూ.. గ్రామంలో 30, 40 మందికి పైగా ఇల్లు లేని పేదలు ఉన్నారని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్నారని ఇప్పటికైనా అర్హత ఉన్న పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని అన్నారు.

గతం నాలుగైదు సంవత్సరాలుగా పెన్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకొని ఎదురు చూస్తున్నారని ప్రభుత్వ హామీ ప్రకారం పెన్షన్ పెంచి నూతన పెన్షన్లు కూడా ఇవ్వాలని అన్నారు. గ్రామంలో వివిధ వార్డులలో ఇంకా మురికి కాలువలు, వీరి లైట్లు, సిసి రోడ్ల సమస్య ఉన్నదని అన్ని వార్డులలో రోడ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీమల కొండూరు నుండి మస్తానపల్లికి, చొల్లేరుకు బీటీ రోడ్ల నిర్మాణం చేయాలనారు. ప్రభుత్వము భూమిలేని పేదలకు ఇస్తానన్న  ఇందిరమ్మ ఆత్మియ భరోసా పథకము, గ్యాస్ సబ్సిడీ, మహిళా రుణాలు ఇచ్చి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి బోడ అంజనేయులు , సభ్యులు రాగుల పోషయ్య, కిష్టయ్య, గ్రామ ప్రజలు రచ్చ ఆంజనేయులు, గోపాల్, మోలుగు రాములు, కూనూరు శ్రీను లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad