Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి..

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జటావత్ రవినాయక్ అన్నారు. బుధవారం
మండలంలోని ఉట్లపల్లి గ్రామపంచాయలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉట్లపల్లి గ్రామంలో గాని, మండలంలోని ఏ గ్రామ పంచాయతీ లో పరిశీలించిన కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. గుడిసెలలో ఉన్న నిరుపేదలకు ఇల్లు ఇవ్వలేదని అన్నారు.

కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు పేద ప్రజలకు న్యాయం జరగదని,రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం అని, పేదలకు ఎస్సీ ఎస్టీలకు, బడుగు బలహీన ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పెద్దవూర మాజీ ఎంపీపీ సలహాదారు సుందర్ రెడ్డి,యూత్ అధ్యక్షులు సైదులు యాదవ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రమావత్ రవి నాయక్, మాజీ డైరెక్టర్ పొదిల శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇంజ శ్రీనివాస్ రెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి,  గౌస్, శాస్త్రి రెడ్డి, మాజీ సర్పంచ్ అంజయ్య, రాజు,  ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad