నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో పరువు అభ్యర్థులకు నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ ప్రత్యేక అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్ చేతులమీదుగా లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారులు త్వరగా గ్రౌండింగ్ చేసుకొని, ముగ్గులు పోసే కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి అన్నారు. ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలను కూడా అందించడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాజమున, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, సీనియర్ నాయకులు నూకల బుచ్చి మల్లయ్య, నిమ్మ రాజేంద్రప్రసాద్, పూజారి శేఖర్, దూలూరి కిషన్ గౌడ్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



