Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటికే ఇందిరమ్మ కోక.!

ఇంటికే ఇందిరమ్మ కోక.!

- Advertisement -

పంపిణీకి ఏర్పాట్లు
నవతెలంగాణ – మల్హర్ రావు

పండుగలు, వివాహాలు వంటి శుభసందర్భాల్లో ఆడబిడ్డలకు చీరను సారెగా పెట్టడం తెలుగింటి సంప్రదాయం. గతంలో తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసేది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా పంపిణీ చేయడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి పేరిట చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ఇంటికే వెళ్లి అధికారులు చీర అందిస్తారు. ఇందుకు సెర్ప్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చీరల పంపిణీ ప్రక్రియని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదివారం కాటారం సబ్ డివిజన్ లోని ఐదు మండలాల్లో ప్రారంభించారు. డిసెంబర్ 9వరకు పంపిణీ పూర్తి చేస్తారు. నేరుగా మహిళలకు అందజేయనున్నారు.

మండలంలో ఇలా…
మండలంలో మొత్తం 15 గ్రామాల పరిధిలో 27 గ్రామైఖ్య సంఘాలు,690 స్వయం సహాయక సంఘాలు, 8,060 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర మహిళలకు గౌరవంతోపాటు, సం ప్రదాయాన్ని బలపరిచే ప్రయత్నం జరుగుతోంది. సారెగా చీర పంపిణీ మహిళల అభివృద్ధి, ఆత్మ విశ్వాసంలో కొత్త వెలుగులు రేకెత్తించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -