బీజేపీ మండల అధ్యక్షులు ఆంజనేయులు
నవతెలంగాణ – చండూరు: నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని బీజేపీ మండల అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు కోరారు. మంగళవారం నల్గొండలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చండూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల ఎంపికలో ప్రభుత్వ నిబందనలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు వారికి ఇష్టం వచ్చిన రితీన అనర్హులకు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కారు, ట్రాక్టర్, ఎక్కువ భూమి, గతంలో ఇందిరమ్మ ఇండ్లు పొందిన తదితర వారికి ఇండ్లు మంజూరు చేయిస్తున్నారు. నిజమైన అర్హులకు ఇండ్లు రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులను ఇండ్లు కావాలని ప్రజలు అడిగితే అధికార పార్టీ నాయకులు ఎవరు చెప్పితే వారి పేర్లు మాత్రమే వస్తాయని, మా చేతిలో ఏమి లేదని వారు ఘంటాపథంగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ రి-వెరిఫికేషన్ చేసి మండలంలోని అన్ని గ్రామాల్లోని నిజమైన అర్హులకు మాత్రమే ఇండ్లు వచ్చే విధంగా చేయలని వినతి పత్రంలో కోరారు. మండలంలోని గ్రామాల్లో ఏకంగా అధికార పార్టీ నాయకులు సైతం ఇందిరమ్మ ఇండ్లు పెట్టుకుని, పేద ప్రజలను గాలికి వదిలేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యను పట్టించుకోని అసలైన పేదలు, అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కలెక్టర్ కు వినతి
- Advertisement -
- Advertisement -