గొంది కిరణ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ నివాస గృహాలు అందుతాయని నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొంది కిరణ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మొద్దులగడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బర్ల సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో కిరణ్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో పేదలకు గృహాలు ఇవ్వకపోగా ఇప్పుడు ఇస్తున్న వారిని విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
ఎవరు నిరాశ చెందవద్దని విడతల వారీగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ నివాస గృహాలు అందుతాయని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన వాసం ప్రశాంత్, మాడె శోభారాణి, సురబాక సరోజన, గట్టి సౌందర్య, దండుగుల లింగమ్మ, కోయడ సుజాత లు సకాలంలో ఇందిరమ్మ గృహాలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనేతలు వాసం శ్రవణ్, రసుపుత్ గిరి, నద్దునూరి రతన్, బాబర్, నాయకులు మెట్టు కొమరయ్య, మాడె నాగేశ్వరరావు, వాసం పాపయ్య, సారయ్య, గట్టి నరేష్, తండా రవి తదితరులు పాల్గొన్నారు.