Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుట్టింటి కానుకగా మహిళలకు ఇందిరమ్మ చీరలు.! 

పుట్టింటి కానుకగా మహిళలకు ఇందిరమ్మ చీరలు.! 

- Advertisement -

రాష్ట్ర ఈజిఎస్ సభ్యుడు దండు రమేష్
తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

పుట్టింటి కానుకగా మహిళలకు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని రాష్ట్ర ఈజిఎస్ సభ్యుడు దండు రమేష్,తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని తాడిచెర్ల, మల్లారం, వళ్లెంకుంట, పెద్దతూండ్ల గ్రామాల్లో మండల ఎంపిడిఓ క్రాoతి కుమార్, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు లతో కలిసి చీరల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హులైన మహిళకు ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ నాయకులు, ఐకెపి సిసిలు, వివోలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -