నవతెలంగాణ-హైదరాబాద్ : ఇందిరమ్మ కోటి చీరల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఇందిరా మహిళాశక్తి పేరిట.. ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెండు దశల్లో కార్యక్రమం జరగనుండగా.. మొదటి దశలో నేటి నుంచి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులు 55 లక్షల చీరలను సిద్ధం చేయగా.. మరో 5 లక్షల చీరలు త్వరలో పూర్తి కానున్నాయి.
నేటి నుంచే ఇందిరమ్మ చీరలు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



