- Advertisement -
సమీక్ష సమావేశంలో మండల ప్రత్యేక అధికారి…వై.విజయ్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
ఇండ్లు లేని నిరుపేదలకు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు లబ్ధిదారులచే చేపట్టేలా చూడాలని మండల ప్రత్యేక అధికారి వై. విజయ్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఎంపిడిఓ శ్రీనివాస్ అధ్యక్షన ఎంపిడిఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ టెక్టికల్, పిల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణంపై ఎప్పటికప్పుడు కార్యదర్శులు,ఉపాధి సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్, పిల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
- Advertisement -