ఏఐపీకెఎంఎస్ జిల్లా కార్యదర్శి ముంజంపల్లి వీరన్న
నవతెలంగాణ – నెల్లికుదరు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వెంటనే అందించా లని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శ ముంజంపల్లి వీరన్న అన్నారు. శుక్రవారం వ్యవసాయ కార్మికులతో నిరస చేసి అనంతరం నెల్లికుదురు తాసిల్దార్ చంద నరేష్ కి వీనతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలకు సరైన ఉపాధి దొరకక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులను గుర్తించటానికి విధి విధానాలు ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన అమలు చెయ్యాలని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి వాటి అమలుకు నిధులు లేవని రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పటం స్థాయిని దిగ జార్చుకోవటమేనని వారు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కరవై పట్టణాలకు వలస పోతున్న వ్యవసాయ కూలీలకు సమగ్ర వేతన చట్టాన్ని రూపొందించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే వ్యవసాయ కూలీలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతను చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జక్కుల యాకయ్య, బూర్గుల మోష వెంకన్న రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES