నవతెలంగాణ – భీంగల్
మండలంలోని దేవన్ పల్లి, పురానిపేట, చెంగల్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై, ప్రభుత్వ పథకాల అమలుపై ఆయా గ్రామాల సెక్రటరీలతో, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో మండల పరిషత్ అధికారి గంగుల సంతోష్ కుమార్ మంగళవారం రోజు సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన చేసి,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని,అన్ని గ్రామాల్లో ఉన్న సెక్రటరీలకు, కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా సూచించారు.బేస్‌మెంట్ లెవల్‌లో ఒక్కొక్కరికి రూ. లక్ష వరకు నిధులు అకౌంట్లలో జమ చేయడం జరిగిందని లబ్ధిదారులకు వివరించాలని అన్నారు. ఇది నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి సహాయపడుతుందని తెలిపారు.ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తేది పురస్కరించుకుని వీలైనన్ని ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, జూన్ 2వ తేదీలోపు మండలంలో మొత్తం గృహ నిర్మాణాలు పూర్తిచేసేలా చూడాలని అన్నారు. గృహ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఇళ్లను ప్రాధాన్యతగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పనులు చేయాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES