Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని వివిధ గ్రామాలలో పేద ప్రజలకు పంపిణి చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్థానిక ఎంపిడిఓ జలంధర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని  వెలువర్తి, మొగిలిపాక, కేర్చిపల్లి, పులిగిల్ల, కంచనపల్లి, దాసిరెడ్డిగూడెం గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పురోగతి పై పరిశీలించి నిర్మాణపనులు వేగవంతం చేయాలని లబ్దిదారులకు సూచించారు. అనంతరం ఉపాధి హామీలో మొక్కలు నాటే కార్యక్రమం, ఇంటింటికి మొక్కలు పంపిణి కార్యక్రమం వేగవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నరేందర్, సైదులు, స్నేహలత, మత్స్యగిరి, పావని, సరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -