Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని మండల పరిషత్  కార్యాలయంలో శుక్రవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సమావేశం నిర్వహించినారు. ఈసందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని అన్నారు.

సమస్యలను మండల స్థాయి, గ్రామస్థాయి, అధికారులు కూర్చుని స్థానిక నాయకులతో చర్చించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ చందర్ నాయక్ , డిపిఓ మురళి, పిడి హౌసింగ్, డిఎల్పిఓ, హౌసింగ్ డీఈ, ఎంపిడివో శ్రీనివాస్, ఎంపివో రాము , ఏఈ హౌసింగ్  ఉమేష్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -