Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి..

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి..

- Advertisement -

– ఎంపీడీవో కృష్ణయ్య 
నవతెలంగాణ – ఊరుకొండ 

ఊరుకొండ మండలంలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎంపీడీవో కృష్ణయ్య అన్నారు. సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి పరిశీలనలో భాగంగా ఊరుకొండ మండల పరిధిలోని బొమ్మరాసిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పరిశీలించగా, గ్రామానికి మంజూరు అయిన మొత్తం 16 ఇండ్లకు గాను నేటి వరకు బిలో బేస్మెంట్ పనులు జరుగుచున్నవి  ఒక ఇల్లు, బేస్మెంట్ పని పూర్తి అయినవి ఒక ఇల్లు, గోడలపని నడుస్తున్నవి ఒక ఇల్లు, రూఫ్ లెవెల్ పూర్తి అయినవి ఒక ఇల్లు, స్లాబ్ పూర్తి అయినవి 3 ఇండ్లు మరియు భూమి సమస్య ఉండి ప్రారంభించనివి 7 ఇండ్లు, ఇండ్లు కట్టుకోవడానికి ఇష్టం లేని వారు ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్రామానికి వివిధ దశల్లో పూర్తి అయిన ఇండ్లకు మొత్తం రూ.8 లక్షలు విడుదల కాబడినట్లు తెలిపారు. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న లబ్ధిదారులు త్వరగా పనులు పూర్తి చేసుకొనుటకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హౌజింగ్ ఏఈ కవిత, ఎంపీ ఓ లక్ష్మణ్ నాయక్, ఎపివో నర్సింహా, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్థాయి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -