- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని గుర్జకుంట గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సర్పంచ్ సంతోష్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేశారు. ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ధిదారులకు ఇళ్లు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, ఆలయ పునర్ నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



