– ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్, మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలో ఈనెల 13న ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ మేళాను విజయవంతం చేయాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్, మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 13న మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులతో పెద్ద ఎత్తున ముగ్గులు పోసే కార్యక్రమాల్ని చేయించాలన్నారు. నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన పత్తి లబ్ధిదారులతో ఈ ముగ్గుల పోసే కార్యక్రమాన్ని పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు.
ఇందుకోసం లబ్ధిదారులను సన్నద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. సోలరైజేషన్ కార్యక్రమంలో భాగంగా అనువుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను, పోడు భూములను గుర్తించాలన్నారు. గ్రామాల్లో ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని పంచాయతీ ప్రత్యేక అధికారులను, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, పంచాయతీ రాజ్ ఏఈ నర్సయ్య, ఆయా గ్రామాల పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ మేళను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES