Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇల్లు.. పేదవాడి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది

ఇందిరమ్మ ఇల్లు.. పేదవాడి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది

- Advertisement -

– బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఇందిరమ్మ ఇల్లు పేదవాడి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలో నందిపేట భూపాల్ నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని చూస్తే వారి కుటుంబ ఆత్మ గౌరవం కనిపిస్తుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల విషయంలో రాజీ పడకుండా ఎప్పటికప్పుడు ఇంటి నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారన్నారు.

నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను చేపడుతుందని ఆయన తెలిపారు.వేల్పూర్ మండల కేంద్రంలో అర్హత ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను తప్పక మంజూరు చేయడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -