Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల శిలాఫలకం ధ్వంసం..

ఇందిరమ్మ ఇండ్ల శిలాఫలకం ధ్వంసం..

- Advertisement -

దుండగులపై చర్యలు తీసుకోవాలి: పరకాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చాడ రఘునాథ రెడ్డి
నవతెలంగాణ – భూపాలపల్లి
: భూపాలపల్లి మండలంలోని  మోరంచపల్లి, నాగారం గ్రామాల్లో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆ దుండగులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, పరకాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చాడ రఘునాథ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..గత రెండు రోజుల కింద భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ శిలాఫలకాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం పిరికిపంద చర్య అన్నారు. గత పది సంవత్సరాలుగా పేదలకు ఇండ్లు కట్టివ్వలేని దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని  అడ్డుకునేందుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను చూసి తట్టుకోలేక బి.ఆర్.ఎస్ చిల్లర పనులు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తోందని అన్నారు.  ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.  ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad