Wednesday, April 30, 2025
Homeజిల్లాలుఇందిరమ్మ ఇండ్లు సర్వే 

ఇందిరమ్మ ఇండ్లు సర్వే 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని పలు ప్రాంతాలలో ఇండ్ల సర్వే నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలు భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని 25వ డివిజన్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో తప్పనిసరిగా వివరాలను స్పష్టంగా సేకరించి నమోదు చేయాలన్నారు. ఎలాంటి సమస్యలకు తావు లేకుండా సర్వే నిర్వహించాలని సంబంధిత అధికారులకు సిబ్బందికి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img