Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి 

ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి 

- Advertisement -

గతంలో పనులు చేసి ఉంటేనే పరిశీలించి చెక్కు డ్రా చేయాలి 
మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని వివిధ గ్రామాలలో వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సర్పంచులకు మరియు ఉపసర్పంచ్ ల కు మండల స్థాయి వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పేద ప్రజల కోసం ప్రభుత్వం ఇందిరా మహిళలను ప్రవేశపెట్టిందని అన్నారు. గ్రామాలకు కేటాయించిన ఇండ్లను పూర్తిస్థాయిలో అన్నిటిక అన్ని పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని సర్పంచులు, ఉప సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు కలిసి గ్రామాలలో తండాలలో తిరుగుతూ త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

గతంలో సర్పంచులు, అధికారులు పనులు చేసి ఉండి ఇప్పుడు కనిపిస్తే రికార్డు అయి ఉంటే వాస్తవాన్ని పరిశీలించి డబ్బులు డ్రా చేయాలని అన్నారు. పనులు లేకుండా చెక్కులను డ్రా చేస్తే పంచాయతీ కార్యదర్శి బాధ్యత వహించాలని అన్నారు. వివిధ శాఖల అధికారులు వీర గ్రామా పంచాయితీ సర్పంచులు ఉప సర్పంచులు అధికారులకు గ్రామాల సమస్యపై ఫోన్ చేస్తే ఆ సంబంధిత శాఖ అధికారి ఫోన్ ఎత్తి గ్రామాలను పరిశీలించి పనులను చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అలా ఫోన్ ఎత్తకుండా ఉంటే అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చందా నరేష్ ఎంపీడీవో కుమార్ స్థానిక సర్పంచ్ పులి వెంకన్న ఎంపీ ఓ పద్మ పంచాయతీ కార్యదర్శి రాజేష్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు వీరితోపాటు జిల్లా మండల నాయకులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -