Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్పవరం 

పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్పవరం 

- Advertisement -

విజయవంతంగా హ్యాపీ సండే కార్యక్రమం
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం
మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు 
నవతెలంగాణ – చండూరు 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న  పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం  అని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం  3వ వార్డులో  గంజి  భ్రమరాంభ  ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమములో మున్సిపల్ వార్డు సభ్యులతో కలిసి రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ నిర్మాణ పధకం వలన నిరుపేదలకు సొంత ఇంటికల నెరవేరిందని, పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరమని అన్నారు.పట్టణంలో పేద ప్రజలు ఇందిరమ్మ ఇండ్లను  సద్వినియోగం చేసుకోవాలన్నారు.

హ్యాపీ సండే” కార్యక్రమములో భాగంగా ఉదయం: 9:00 గంటలకు గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ విద్యార్దులతో యోగా కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగ చేయడం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి రోజూ యోగ చేయడం అలవాటు చేసుకోవాలని పాఠశాల విద్యార్థులకు చెప్పారు.  

 మున్సిపల్  కమీషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ యోగ చేయడంవలన మనసు ఏకాగ్రత మరియు చదువు పైన ద్రుష్టి సాదిస్తారని, పాఠశాల విద్యార్థులకు వివరించారు. ఈ  కార్యక్రమములలో  వైస్ చైర్ పర్సన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు  తెలుకుంట్ల రాజకుమారి, బుషిపాక వాసు, సామ సుజాత, జెల్ల ధనమ్మ, కోన్రెడ్డి మధు, కోడి సుష్మవెంకన్న, కటకం రమేష్,  అయుష్ యోగ ఇన్స్పెక్టర్ ఇడికూడా వెంకటేష్,వార్డు ఆఫీసర్స్ శ్రీరాములు,సాయి రామ్,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం.అరవింద్ రెడ్డి, బిల్ కల్లెక్టర్స్ మహేష్,రమేష్,మంజుల,మెప్మ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -