అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేదు
గ్రామాల్లో లబ్ధిదారుల పేర్లను డిస్ ప్లే చేయాలి
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని నిరుపేదలకు అర్హులుగా ఎంపిక చేయాలని ఆదివారం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత 10 సంవత్సరాల్లో ఏ గ్రామానికి డబుల్ బెడ్ రూం రాలేదని, ఇప్పుడు ఊరూరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయన్నారు. మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఎవరైనా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు వస్తె తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అవినీతి ఆస్కారం జరిగి అనర్హుల ఎంపిక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తరువాత ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక జరగాలని పేర్కొన్నారు. అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పేర్లను గ్రామాల్లో డిస్ ప్లే చేయాలని ఆదేశించారు. గత పది సంవత్సరాల్లో ఏ గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ రాలేదని, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామానికి వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇళ్లు రాని వారు నిరాశపడాల్సిన అవసరం లేదని, రెండు నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇల్ల లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో గ్రామాల్లో సయోధ్య లేక ఇబ్బందులు పడవద్దని, గ్రామాల్లో అందరూ కూర్చొని అర్హతలో అతిపెదవాడికి ఇల్లు రావాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES